: ప్రధాని, సోనియాకు మనియార్డర్లు పంపిన బీజేపీ కార్యకర్తలు
ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీలకు మహారాష్ట్ర విదర్భ ప్రాంతంలోని అకోలా ప్రాంతానికి చెందిన స్థానిక బీజేపీ కార్యకర్తలు ఒక రూపాయి, రూ.5, రూ.12ల విలువ చేసే మనియార్డర్లు పంపారు. ముంబయి, ఢిల్లీల్లో రూ.12,రూ.5లకే కడుపునిండా భోజనం చేయవచ్చంటూ కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ నేతలు వెకిలి వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ స్థానిక ఎమ్మెల్యే గోవర్ధన్ శర్మ వ్యతిరేక ప్రచార వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మనియార్డర్లు పంపారు. అనంతరం, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదరికాన్ని తగ్గించి చూపేందుకే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తోందని మండిపడ్డారు.