: పాతబస్తీలో భద్రత పెంపు
వరుస పేలుళ్ల ఘటన నేపథ్యంలో హైదరాబాద్ పాతబస్తీలో భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల దాడులకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఈరోజు బందుకు పిలుపునివ్వగా, మరోవైపు ముస్లింలకు శుక్రవారం పవిత్రమైన దినం కావడంతో పాతబస్తీ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసు బలగాలను రప్పించారు.
ముస్లింలు ఈరోజు హెచ్చు సంఖ్యలో ప్రార్థనలకు రానుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే ప్రార్థనలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముగిశాయి. కాగా, పాతబస్తీలోని మసీదుల్లో మెటల్ డిటెక్టర్లు, బాంబు స్క్వాడ్ లతో తనిఖీలు నిర్వహించారు.