: తాగి విధులకు హాజరైన ఎలక్షన్ సిబ్బందిపై వేటు
తాగుబోతు ఎలక్షన్ సిబ్బందిపై అధికారులు వేటువేశారు. పూటుగా తాగి ఎన్నికల విధులకు హాజరయ్యారని కరీంనగర్ జిల్లా గంగాధరపురం మండలం నాగిరెడ్డిపూర్ లో నలుగురు ఉపాధ్యాయులను అధికారులు సస్పెండ్ చేశారు. వీరు మద్యం తాగి పోలింగ్ విధులకు వచ్చినట్టు అధికారులు తెలిపారు.