: ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేతిలో దెబ్బలు తిన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే


కేరళలోని పత్తనంతిట్టలో ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేతిలో ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే దెబ్బలు తిన్న ఘటన చోటుచేసుకుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కె.శివదాసన్ నాయర్ అరణమల్ లో ఓ ఫంక్షన్ కు వెళ్లి వస్తుండగా ఆర్ఎస్ఎస్ కు చెందిన పలువురు కార్యకర్తలు ఆయనను అడ్డుకున్నారు. అరణమల్ జిల్లాలో ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి వ్యతిరేకంగా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా ఆయనపై ఓ ఆర్ఎస్ఎస్ కార్యకర్త చేయిచేసుకున్నాడని, కేసు నమోదైందని ఆ ప్రాంత పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News