: ఇఫ్తార్ విందుకు సల్మాన్ ను ఆహ్వానించిన షారుక్


బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్, మరో హీరో సల్మాన్ ఖాన్ మధ్య స్నేహం మళ్ళీ చిగురిస్తున్నట్టే కనిపిస్తోంది. రేపు సాయంత్రం తన నివాసంలో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్ విందుకు సల్మాన్ ను షారుక్ ఆహ్వానించాడు. ఈ మేరకు షారుక్ ప్రత్యేక ఆహ్వానాన్ని కూడా పంపాడట. ఈ మధ్యే ముంబయిలో ఓ రాజకీయ నాయకుడు ఇచ్చిన ఇఫ్తార్ పార్టీలో షారుక్, సల్మాన్ కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

అప్పటినుంచి వీరిరువురి మధ్య ఉన్న సంవత్సరాల నాటి శత్రుత్వం చెరిగిపోయిందని, ఒక్కటయ్యారని అంతా అనుకుంటున్నారు. ఇది నిజమేనని చెప్పేందుకు తాజాగా ఈద్ పార్టీకి కింగ్ ఖాన్, కండలవీరుడిని పిలవడం బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత ఆనందాన్నిస్తోంది. మరి ఈ విందుకు సల్మాన్ వస్తాడా? లేదా? అన్నది తెలియని ప్రశ్న.

  • Loading...

More Telugu News