: జమ్మూకాశ్మీర్ ను విభజించాలి: శివసేన


తెలంగాణ ఎఫెక్ట్ జమ్మూకాశ్మీర్ కు చేరింది. జమ్మూకాశ్మీర్ ను విభజించాలని శివసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఉదయం శివసేన కార్యకర్తలు జమ్మూలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. జమ్మూకాశ్మీర్ ను విడగొట్టడం ద్వారా కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇక, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, రాష్ట్రీయ లోక్ దళ్ అధ్యక్షుడు అజిత్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, ఉత్తరప్రదేశ్ ఈశాన్య భాగాన్ని హరిత ప్రదేశ్ పేరిట విభజించాలని పేర్కొన్నారు. యూపీ మాజీ సీఎం మాయావతి కూడా రాష్ట్రాన్ని నాలుగు ముక్కలు చేయాలని సూచించిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News