: పుంజుకున్న 'సైకిల్'
తుదివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు దూసుకెళుతున్నారు. కొనసాగుతున్న ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇప్పటివరకు 786 సర్పంచి పదవులు కైవసం చేసుకోగా, టీడీపీ మద్దతిస్తోన్న అభ్యర్థులు 736 పంచాయతీల్లో జయభేరి మోగించారు. రెండు పార్టీల మధ్య తేడా 50 కావడంతో ఓట్ల లెక్కింపు ముగిసేసమయానికి టీడీపీ.. అధికార పార్టీని అధిగమించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులంటున్నారు.