: చారిత్రక తప్పిదం చేశాం.. ఇప్పటికైనా మేలుకొందాం: జయప్రకాశ్ నారాయణ


ఒక నగరం చుట్టూ మన జీవితాలు పెనవేసుకోవడంతోనే ఈ సంక్షోభం ఏర్పడిందని జయప్రకాశ్ నారాయణ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పట్టణీకరణ క్రమబద్ధంగా జరిగితే ఇప్పుడు ఉన్న పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదని అన్నారు. రాజధానినే అన్నింటికీ కేంద్రం చేసుకోవడం వల్లే తాజా రాజకీయాలు కేంద్రీకృతమయ్యాయని మండిపడ్డారు. ప్రపంచంలో చాలా రాజధానులు ఎవరికీ తెలియవని, ప్రధాన పట్టణాలు వేరుగా ఉంటాయని న్యూయార్క్ లాంటి రాష్ట్రాలను ఉదహరించారు. మరోసారి రాజధాని సమస్య ఏర్పడకుండా ప్రధాన కార్యాలయాలను వికేంద్రీకరణ చేస్తూ పట్టణాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

పోలవరం ప్రాజెక్టు వల్ల రాయలసీమ, కోస్తా ప్రాంతాలు సస్యశ్యామలమవుతాయని అన్నారు. దీనిని పూర్తి చేస్తానని కేంద్రం ముందుకు రావడం శుభసూచకమన్నారు. అలాగే రాజకీయాలు కేవలం ముఖ్యమంత్రి కేంద్రంగా ఉండడం కాకుండా జిల్లా కేంద్రంగా సాగేలా పోరాటం చేస్తే మరోసారి ఇలాంటి ఉపద్రవాలు రావన్నారు. సోదరుల్లా కలిసిమెలసి ఉందామని అన్నారు. మరో రాజధాని సృష్టించుకుందామని పిలుపునిచ్చారు. హైదరాబాద్ లో ఉన్నవారు భయబ్రాంతులకు గురికావాల్సిన అవసరం లేదన్నారు. ఇంతకు ముందులాగే ఇకపై కూడా ఉందామని ఆయన పిలుపునిచ్చారు.

  • Loading...

More Telugu News