: అస్సాంలో 'కర్బి అంగ్లాంగ్' రాష్ట్ర డిమాండ్.. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సెగ
తెలంగాణ ఎఫెక్ట్ దేశంలోని మిగతా రాష్ట్రాలకూ పాకింది. అస్సాంలో 'కర్బి అంగ్లాంగ్' ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. తమ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రం చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లపై ఆందోళనకారులు దాడులు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాల్లో కాల్పులు జరిపి ఆందోళనకారులను చెదరగొట్టారు.