: బస్సులు రద్దు చేసిన కర్ణాటక
కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆంధ్రప్రదేశ్ కు బుధవారం తాత్కాలికంగా బస్సు సర్వీసులను రద్దు చేసింది. తెలంగాణ ప్రకటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఆందోళనలు చెలరేగి నష్టం వాటిల్లే అవకాశముందని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. కేఎస్ఆర్టీసీ వివిధ ప్రాంతాలకు ప్రతి రోజు 128 బస్సు సర్విసులను నడుపుతోంది.