: శ్రీదేవికి గాయం
అలనాటి అందాల నటి శ్రీదేవికి గాయమైంది. ప్రస్తుతం అమెరికాలో కుటుంబ సమేతంగా ఉన్న శ్రీదేవి ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో ఆమె కుడి మోకాలికి గాయమైంది. దీంతో, ఆమెను ఆసుపత్రికి తరలించారు. గాయానికి ఎంఆర్ఐ స్కాన్ నిర్వహించారు. కాగా, ఆగస్టు 13న శ్రీదేవి 50వ పడిలో ప్రవేశించనుంది. ఆమె జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించాలని భర్త బోనీ కపూర్ నిశ్చయించాడట. కానీ, శ్రీదేవి గాయపడడంతో బోనీ ప్రణాళికలపై అనిశ్చితి ఏర్పడింది.