: ఖరీదైన వస్తువులపై మరింత పన్ను
ఉన్నత ఆదాయ వర్గాలు ఉపయోగించే ఖరీదైన వస్తువులపై మరింత పన్ను విధించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. కరెంటు ఖాతా లోటును తగ్గించేందుకు ఈ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. స్థానికంగా ఉత్పత్తి చేయదగిన వస్తువుల దిగుమతులు పెరుగుతుండడంతో కరెంటు ఖాతా లోటుపై భారం పడుతోందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో లగ్జరీ గూడ్స్ పై ఎక్కువ పన్ను విధించాలని యోచిస్తోంది. స్థానికంగా ఉత్పత్తి చేయదగి, దిగుమతుల అవసరం లేని వస్తువులు నిత్యావసరాలు కాదని ఆర్థిక మంత్రి చిదంబరం అన్నారు. ఈ నేపథ్యంలో కరెంట్ ఖాతా లోటును తగ్గించేందుకు పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని చెప్పారు.