: ఖైదీల కోసం ఎఫ్ఎం రేడియో స్టేషన్


దేశంలోని జైళ్లన్నింటిలోనూ ఢిల్లీలోని తీహార్ జైలు వేరయా...అనుకోవాలి. ఎందుకంటే, తప్పు చేసిన వారు తీహారు జైలుకు వస్తే మళ్లీ మార్పుతో బయటకు వెళతారు. శిక్ష.. శిక్షలా కాకుండా ఇక్కడి ఖైదీలను ఉపాధి, ఇతరత్రా వ్యాపకాల్లో భాగస్వాములను చేయడమే ఇందుకు కారణం.

తీహార్ జైలు ఖైదీలు ఇప్పటికే పెద్ద ఎత్తున నిత్యావసర వస్తువులు, పిండి వంటలు, స్వీట్లను మార్కెట్ చేస్తున్నారు. వీటి తయారీకి జైలు ఆవరణలో కర్మాగారాన్నే ఏర్పాటు చేశారు. ఇప్పుడు వీరి కోసం ప్రత్యేకంగా ఎఫ్ఎం రేడియో స్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది.

సెంట్రల్ జైలు నంబర్ 4లో 'టీజే ఎఫ్ఎం రేడియే' స్టేషన్ ను జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ విమలా మెహ్రా మంగళవారం ప్రారంభించారు. ఖైదీలకు వినోదం అందించడం, వారిని రేడియోజాకీలుగా తీర్చిదిద్దటమే ఈ స్టేషన్ ఏర్పాటు లక్ష్యాలని జైలు అధికారులు తెలిపారు. నచ్చిన పాటలను వినే సౌలభ్యం కూడా ఉందని చెప్పారు. గాంధీ బోధించిన అహింసా, మత సామరస్యం సూత్రాలను కూడా వినిపిస్తారట.

  • Loading...

More Telugu News