: 65 మంది భారత జాలర్లపై శ్రీలంకలో కేసు
శ్రీలంకలో 65 మంది భారత జాలర్లపై అంతర్జాతీయ ప్రాదేశిక జల సరిహద్దులను అతిక్రమించిన వ్యవహారంలో కేసు నమోదైంది. లంకలోని ప్రాదేశిక సముద్ర జలాల్లోకి అనుమతిలేకుండా భారత జాలర్లు ప్రవేశించడంతో అరెస్టు చేశామని ఆ దేశ నౌకా విభాగ అధికార ప్రతినిధి తెలిపారు. తొమ్మిది నావలను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు.
గతరాత్రి ఉత్తరకోస్తాలోని పిండ్రో ప్రాంతంలో ఐదు నావల్లో 34 మందిని, తూర్పు ముల్లైతీవు ప్రాంతంలో మరో నాలుగు నావల్లో లంక సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 31 మంది భారతీయ జాలర్లను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అందరినీ ట్రికోమలిలోని అధికారులకు అప్పగించామన్నారు. తరచుగా లంక ప్రాదేశిక సముద్ర జలాల నిబంధనలను భారతీయ జాలర్లు అతిక్రమిస్తుండటంతో శాశ్వత పరిష్కారంకోసం చర్యలు తీసుకోవాలని ఆ దేశ ఆర్ధికమంత్రి ఆదేశించారు.