: నటి కనక నిక్షేపం


నటీమణి కనక కేన్సర్ తో చావు బతుకుల్లో ఉందంటూ వార్తలు రావడంతో.. 'నేను బానే ఉన్నాను' అంటూ కనక మీడియా ముందు ప్రత్యక్షమైంది. అలనాటి కథానాయిక దేవిక కూతురే కనక. తెలుగులో రాజేంద్రప్రసాద్ తో కలిసి 'వాలు జడ తోలుబెల్టు' చిత్రంలో కనిపించింది. తెలుగుతోపాటు తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలలోనూ నటించింది. అయితే, కేన్సర్ తో బాధపడుతున్న కనక కేరళలోని ఒక ఆస్పత్రిలో చావు బతుకుల్లో ఉందంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో వార్తలు వచ్చాయి. చనిపోయిందంటూ కూడా వదంతులు రావడంతో, చెన్నైలోని తన నివాసం వద్ద కనక మీడియాను పిలిచి మరీ, 'బానే ఉన్నా, బతికే ఉన్నా'నంటూ నవ్వుతూ చెప్పింది.

  • Loading...

More Telugu News