: రగులుతున్న సీమాంధ్ర.. తెలంగాణ ప్రశాంతం


రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు తీవ్రతరం అవుతున్నాయి. రాయలసీమ, ఆంధ్ర ప్రాంతంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలలోనూ సమైక్యవాదులు, జేఏసీ నేతలు, విద్యార్థులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యా, వాణిజ్య సంస్థలన్నీ మూతపడ్డాయి. బస్సులు, ఆటోలు నిలిచిపోయాయి. ఆందోళనలు అదుపు తప్పకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. భారీ ఎత్తున బలగాలను మోహరించారు. మొన్నటి వరకూ ఉద్యమంతో ఉడికిపోయిన తెలంగాణలో మాత్రం పరిస్థితి ప్రశాంతంగా ఉంది. ఇక్కడ పోలీసు బలగాలను ఏర్పాటు చేసినప్పటికీ.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ ఓకే చెప్పేయడంతో ఆందోళనలు పూర్తిగా సమసిపోయాయి. సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న రాజధానిలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

  • Loading...

More Telugu News