: కాంగ్రెస్ నేతలు చేతగాని దద్దమ్మలు: అనంతపురం విద్యార్థులు
సీమాంధ్ర నాయకులు చేతకాని దద్దమ్మలంటూ అనంతపురంలో విద్యార్థులు పెద్ద ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంతోపాటు ప్రధాన పట్టణాల్లో వేలాది సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పనిలో పనిగా కేసీఆర్ పై కూడా దుమ్మెత్తిపోశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడంలో సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు విఫలమయ్యారంటూ మండిపడ్డారు. నిరసన ప్రదర్శనలతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.