: అమ్మపాలు తాగితే.. జ్ఞానం ఎక్కువ అవుతుంది


పుట్టిన బిడ్డకు ముర్రుపాలు దగ్గరినుంచి వీలైనంత వరకు అమ్మపాలు తాగించడం వారి జీవితపర్యంతమూ సుస్థిరమైన ఆరోగ్యానికి కారణం అవుతుందని మనకు అనేక అధ్యయనాలు చెబుతుంటాయి. ప్రభుత్వం కూడా అమ్మపాల ఆవశ్యకత గురించి అవగాహన కల్పించడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటుంది. అలాంటి ప్రచారానికి దన్నుగా నిలిచే మరో అధ్యయనం ఇది. అమ్మపాలు తాగేవారిలో మేధోశక్తి కూడా అధికంగా ఉంటుందిట. చిన్నప్పుడు వీలైనంత ఎక్కువకాలం అమ్మపాలు తాగిన వారిలో తెలివితేటలు ఎక్కువని బోస్టన్‌ పిల్లల ఆస్పత్రికి చెందిన మ్యాండీ బెల్‌ఫోర్డ్‌ బృందం నిర్వహించిన స్టడీ తేల్చింది.

మూడేళ్ల వయసులోనే వీరు భాషను మెరుగ్గా గ్రహించగలుగుతారని, ఏడేళ్ల వయసుకెల్లా... వెర్బల్‌, నాన్‌వెర్బల్‌ మేధోశక్తి పెరుగుతుందని.. ఇలా అన్ని వయసుల్లోనూ మెరుగైన ప్రతిభను కనబరుస్తారని వారు తేల్చారు.

  • Loading...

More Telugu News