: సద్దాం అంటే అమెరికాకు ఎంత గౌరవమో!
సద్దాం పట్ల అమెరికాకు గౌరవం ఉంటుందా? బంకర్లలో దాక్కున్న అతగాడిని వెతికి పట్టుకుని ట్రయల్ నిర్వహించి చంపిన అమెరికా.. ఆయన పట్ల గౌరవం చూపిస్తుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే అలా అనిపించే సంఘటన ఇది. సద్దాం కు చెందినదిగా భావిస్తున్న బంగారు పూతలు గల ఒక విలువైన ఖడ్గాన్ని అమెరికా, ఆయన స్వదేశం అయిన ఇరాక్‌కు లాంఛనంగా, కానుకగా పంపించింది.
అరబ్బీ అక్షరాలు బంగారు పూతలతో ధగధగ లాడుతున్న ఓ అద్భుతమైన ఖడ్గం సద్దాం హుసేన్ వ్యక్తిగత కార్యాలయంలో ఉండేదిట. అమెరికా సైనికచర్య తర్వాత ఆ ఖడ్గం ఏమైందో ఎవ్వరికీ తెలియదు. 2012లో అమెరికాలో ఒక వేలం పాటలో అది వెలుగు చూసింది. అయితే వేలం జరిగితే.. మాంఛి ధర పలికితే.. సద్దాం కీర్తికిందకు అది గుర్తింపు తెస్తుందని భయపడ్డారో ఏమో గానీ.. అమెరికా స్పందించింది. అది సద్దాంకు బహుమతిగా వచ్చి ఉంటుందని ఆ ఖడ్గాన్ని వారినుంచి స్వాధీనం చేసుకుని.. ఇరాక్‌కు పంపించేశారట. ఎంత ఔదార్యమో అనిపిస్తోంది కదా!