: ఐన్‌స్టీన్‌ థియరీ ఆల్‌టైం గ్రేట్‌


కాంతి వేగానికి మించినది లేదని చెప్పిన ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం శతాబ్దం గడుస్తున్నా కాల పరీక్షకు నిలబడుతోంది. శతాబ్దకాలంగా ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నా.. మరింత నిగ్గు తేలుతున్న కాంతివేగానికి మించినది లేదనే సిద్ధాంతంపై తాజాగా మరో పరీక్ష జరిగింది. కాలిపోర్నియా యూనివర్సిటీ వారు నిర్వహించిన ఈ పరీక్షలో మళ్లీ ఐన్‌స్టీన్‌ సిద్ధాంతం గ్రేట్‌ అని తేలింది.

ఈ పరీక్షలో.. వారు డిస్‌ప్రోజియం అనే మూలకానికి సంబంధించిన రెండు ఐసోటోప్‌లను తీసుకున్నారు. ఎలక్ట్రాన్లు ఒక పరమాణు కక్ష్య నుంచి మరో పరమాణు కక్ష్యలోకి మారేందుకు అవసరమైన వేగాన్ని లెక్కకట్టారు. సిద్ధాంతపరంగా ఎలక్ట్రాన్‌ వేగం కాంతివేగంతో సమానం. 17 నానోమీటర్ల పరిధిలో అన్ని దిశల్లో పరీక్షించి చూసినప్పుడు కూడా వాటి వేగంలో మార్పు కనిపించలేదు. దీనివలన ఎలక్ట్రాన్లు కాంతిని మించిన వేగంతో వెళ్లడం లేదని నిర్ధరించారు.

  • Loading...

More Telugu News