: విజయనగరం జిల్లా ఎమ్మెల్యేలమంతా రాజీనామా చేస్తున్నాం: ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి


విజయనగరం జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా రాజీనామా చేస్తున్నామని ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు. వెనుకబడిన ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుంటే తమ ప్రాంతమే బాగా వెనుకబడిందని ఆయన పునరుద్ఘాటించారు. కేవలం చాలాకాలంగా డిమాండ్ ఉందనే కారణం చూపి, విభజనకు పచ్చజెండా ఊపడం సరికాదని ఆయన అన్నారు. అందుకే కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తమ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలంతా తమ రాజీనామాలను రేపు స్పీకర్ కు పంపుతామని కోలగట్ల వీరభద్రస్వామి తెలిపారు.

  • Loading...

More Telugu News