: భారత్ లో పుట్టి పాకిస్తాన్ ప్రెసిడెంటయ్యాడు
పాకిస్తాన్ నూతన అధ్యక్షుడిగా మమ్నూన్ హుస్సేన్ ఎన్నికయ్యారు. హుస్సేన్ భారత్ లో పుట్టిన వ్యక్తి కావడం విశేషం. హుస్సేన్ ఆగ్రాలో జన్మించగా.. ఆయన కుటుంబం 1947లో దేశవిభజన సందర్బంగా పాకిస్తాన్ కు వలస వెళ్ళింది. కాగా, ప్రధాని నవాజ్ షరీఫ్ కు సన్నిహితుడని పేరు పడ్డ హుస్సేన్.. ఎన్నికలో తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ పార్టీ అభ్యర్థి, మాజీ న్యాయమూర్తి వజీహుద్దీన్ అహ్మద్ పై స్పష్టమైన ఆధిక్యంతో నెగ్గారు. సెప్టెంబర్ లో ఈయన, ప్రస్తుత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ స్థానంలో పాక్ 12 వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.