: అన్నీ ఇప్పుడే అయిపోలేదు: కోదండరాం
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రసాధనలో కీలక మైలురాయిని దాటామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అన్నారు. యూపీఏ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని జేఏసీ నేతలు, తెలంగాణ శ్రేణుల హర్షాతిరేకాల మధ్య ఆయన మాట్లాడుతూ ఇల్లలకగానే పండగ కాదని, పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందితేనే సమస్య పరిష్కారమైనట్టని తెలిపారు. తెలంగాణ ప్రక్రియ ఆచరణలోకి తీసుకొచ్చిన పిదపే సంబరాలు చేసుకుందామని పిలుపునిచ్చారు.