: ఇది చరిత్రాత్మకమైన రోజు: డిప్యూటీ సీఎం
తొలి నుంచి తెలంగాణ కోసం పట్టుబట్టిన ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. ఢిల్లీలో నేడు మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఈరోజు తెలంగాణ ప్రజలకు చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఈ సందర్భంగా సోనియాకు, సీడబ్ల్యూసీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు.