: విషమ పరిస్థితులలో ఏడుగురు
నిన్నటి పేలుళ్లలో గాయపడిన వారిలో ఏడుగురు ప్రాణాల కోసం పోరాడుతున్నారు. యశోదా ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న వారిలో పాండురంగారెడ్డి, మధుసూదన్ రెడ్డి, రవికుమార్, శివకుమార్, రజిత, శ్రీనివాసరావుల పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరోవైపు కేర్ ఆస్పత్రిలో విజయప్రసాద్ అనే బాధితుడి పరిస్థితి కూడా సీరియస్ గా ఉందని వైద్యులు వెల్లడించారు.