: సీమాంధ్రలో మిన్నంటిన నిరసనలు.. రాహుల్ కు ప్రధాని?


హైదరాబాద్ తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో నిరసనలు మిన్నంటాయి. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే రాష్ట్రాన్ని విభజించిందని సీమాంధ్రప్రజలు మండిపడుతున్నారు. స్వాతంత్రసమరయోధుల పోరాట ఫలితంగా ఏర్పడిన రాష్ట్రాన్ని ముక్కలు చేసి తన గోతిని తానే తవ్వుకుందని అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయంతో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని హెచ్చరిస్తున్నారు. తన నిర్ణయం మీద అంత నమ్మకమున్న కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలకు ముందు ఈ నిర్ణయాన్ని ప్రకటించి ఉండాల్సిందని, అప్పుడే కాంగ్రెస్ భవిష్యత్తు తేలిపోయేదని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలను సీమాంధ్రలో ముందుపెట్టి, ప్రజలను మభ్యపెట్టి ఇప్పుడు నిర్ణయం ప్రకటించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాహుల్ ప్రధాని ఎలా అవుతాడో చూస్తామని పలువురు సవాలు విసురుతున్నారు.

  • Loading...

More Telugu News