: యూపీఏ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: కేటీఆర్
తెలంగాణపై ఏకగ్రీవ తీర్మానం చేసిన యూపీఏ సమన్వయ కమిటీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే కె. తారకరామారావు అన్నారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టి పాస్ చేసిన తర్వాతే సంబరాలు జరుపుకుంటామని తెలిపారు. హైదరాబాద్ తో కూడిన పది జిల్లాలతో కూడిన తెలంగాణే తమకు ఆమోదయోగ్యమని ఆయన స్పష్టం చేశారు.