: కాసపేట్లో గన్ పార్కు వద్దకు కేసీఆర్
తెలంగాణ కల సాకారం అవుతుండటంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాదులోని అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్కు వద్దకు కాసేపట్లో చేరుకోబోతున్నారు. ఇక్కడికి వచ్చి తెలంగాణ అమరవీరుల స్థూపాలకు పూలమాల వేసి, నివాళులర్పిస్తారని తెలుస్తోంది. ఏడు గంటలకు ఏఐసీసీ కీలక ప్రకటన చేయనుండటంతో ఇక్కడికి వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ భవన్ లో పార్టీ మేధావులు, నేతలతో ఆయన సమావేశం జరుపుతున్నారు. అది ముగిసిన వెంటనే కేసీఆర్ బయలుదేరతారు.