: కాంగ్రెస్ లోకి విజయశాంతి.. టీఆర్ఎస్ ఫ్లెక్సీలు పీకేసిన కేసీఆర్ చెల్లి


టీఆర్ఎస్ నాయకురాలు, టీఆర్ఎస్ అధినేత చెల్లెలని సంబోధించిన ప్రముఖ సినీ నటి విజయశాంతి మరోసారి జంపింగ్ జపం చేయనున్నారు. గతంలో బీజేపీనుంచి బయటికొచ్చి వేరుకుంపటి పెట్టిన విజయశాంతి, కాలక్రమంలో తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేశారు. కాగా రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఆమె కాంగ్రెస్ లో కలవనున్నారని ఊహాగానాలు వచ్చాయి. కానీ ఆయన అసువులు బాయడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నారు. తాజాగా మరోసారి ఆమె కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. గత వారం రోజులుగా ఢిల్లీలో మకాం పెట్టిన రాములమ్మ తన ఇంటి వద్దనున్న టీఆర్ఎస్ ఫ్లెక్సీలన్నీ పీకేయించారు. కాంగ్రెస్ తెలంగాణపై ప్రకటన వెలువడగానే ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారని సమాచారం. రానున్న ఎన్నికల్లో మెదక్ నుంచి ఎంపీగా ఆమె పోటీ చేయనున్నారని కూడా ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

  • Loading...

More Telugu News