: 'గుండె బద్దలవుతోంది..' మీడియా సాక్షిగా ఏడ్చిన నన్నపనేని
హైదరాబాద్ ను ఎలా ఇస్తారని టీడీపీ నేత నన్నపనేని రాజకుమారి ప్రశ్నించారు. తెలుగు జాతి విచ్ఛిన్నమైపోతుంటే చూస్తూ ఊరుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన లైవ్ లో ఆమె కంటనీరు పెట్టుకున్నారు. అందరూ హైదరాబాద్ విషయంలో ఆలోచించాలని కోరారు. మూడు ప్రాంతాల ప్రజలూ దీన్ని తమ ప్రాంతం అనుకున్నారనీ, దీన్ని చీలుస్తామంటే ఒప్పుకోమని తెలిపారు. ఎందరో మహానుభావులు పోరాడి సాధించుకున్న రాష్ట్రం బద్దలవుతుంటే గుండె బద్దలవుతోందని ఆమె అన్నారు. 'నాకిక్కడ బెత్తెడు జాగా లేకపోయినా, నా తమ్ముడు మరణించినా, తల్లి మరణించినా నేను బాధపడలేదు' అని తెలిపారు. 'తెలుగుతల్లీ...నన్ను క్షమించు' అంటూ గద్గద స్వరంతో ఆమె వ్యాఖ్యానించారు.