: పార్లమెంటులో బిల్లు పెట్టాకే నమ్ముతాం: కేకే


పార్లమెంటులో బిల్లు పెట్టాకే తెలంగాణ అంశంపై కాంగ్రెస్ ను విశ్వసిస్తామని టీఆర్ఎస్ జాతీయ వ్యవహారాల ఇన్ చార్జి కె.కేశవరావు తెగేసి చెప్పారు. ఢిల్లీలో ఈ సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ, హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని అన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టే వరకు సంబరాలకు దూరంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదుపై రాజీపడబోమని, రాజధానితో కూడిన తెలంగాణే కావాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News