: మౌనంగా ఉంటే బాబు చరిత్ర హీనుడవుతారు: అంబటి
టీడీపీ నేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు మండిపడ్డారు. ఓ పక్క రాష్ట్ర విభజన జరుగబోతుంటే, ఈ అంశానికి సంబంధించి బాబు మౌనంగా ఉంటే చరిత్ర హీనుడిగా మిగిలిపోతారని విమర్శించారు. కేంద్రం కీలక నిర్ణయం తీసుకునే సమయంలో బాబు ఏ మూల దాక్కున్నారని ప్రశ్నించారు. గుంటూరులో మీడియా సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. నాడు ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్.టి.రామారావు తెలుగు జాతి అభివృద్ధికి కృషిచేస్తే.. ఆయన తర్వాత వచ్చిన బాబు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.