: 'తెలంగాణ రాష్ట్రం' కేవలం కాంగ్రెస్ నిర్ణయమే: లగడపాటి
తెలంగాణకు అనుకూలంగా ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీ నిర్ణయమే అవుతుంది కానీ, ప్రభుత్వ నిర్ణయం కాదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన నిర్ణయం మాత్రం ఉండబోదన్నారు. పార్టీ నిర్ణయాన్ని అడ్డగించడానికి తమకు చాలా మార్గాలున్నాయని చాలా ఆవేశంగా చెప్పారు. గతంలో టీడీపీ ఎలా వ్యవహరించిందో ఇప్పుడూ కాంగ్రెస్ అలాగే వ్యవహరిస్తుందని పేర్కొన్నారు. ఒకవేళ నిర్ణయం తీసుకుంటే చర్చించుకోవడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు, పార్లమెంటు, అసెంబ్లీ ఉన్నాయని.. ప్రజలకు జరిగే నష్టం గురించి అధిష్ఠానానికి చెబుతామని లగడపాటి ఢిల్లీలో అన్నారు.