: తూర్పుగోదావరి జిల్లా న్యాయవాదులు విధులకు గైర్హాజరు
తెలంగాణపై కేంద్రం ఓ నిర్ణయం వెలువరించనున్న నేపథ్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా బుధవారం కూడా విధులకు గైర్హాజరు కావాలని రాజమండ్రిలో న్యాయవాదులు నిర్ణయించారు. ఈ రోజు విధులకు గైర్హాజరైన న్యాయవాదులు రేపు జిల్లావ్యాప్తంగా ఉన్న బార్ అసోసియేషన్ కార్యకర్తలతో సమావేశమవ్వాలని నిర్ణయించారు. భవిష్యత్తు కార్యాచరణపై న్యాయవాదులంతా రేపు నిర్ణయించనున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తమ కార్యాచరణ ఉంటుందని వారు స్పష్టం చేశారు.