: పలు కోణాలలో దర్యాప్తు ముమ్మరం
ఉగ్రవాదుల బాంబు దాడులపై పలు విభాగాల దర్యాప్తు కొనసాగుతోంది. ఒకవైపు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ), మరోవైపు ఆక్టోపస్, ఫోరెన్సిక్ విభాగాలు రంగంలోకి దిగి పేలుళ్ల ప్రాంతాన్ని జల్లెడ పట్టాయి. ఆధారాల కోసం అన్వేషించాయి. పేలుళ్లలో అమ్మోనియం నైట్రేట్ రసాయనాన్ని, టైమర్లను వాడినట్లుగా గుర్తించారు.
అలాగే, ఈ దాడులకు ఉగ్రవాదులు అనుసరించిన వ్యూహం ఏమిటి? పేలుళ్లప్పుడు వారు ఎక్కడ ఉండి ఉంటారు? పేలుళ్లకు ముందు ఆ ప్రాంతంలో సంచరించిన వారిలో అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? తదితర వివరాలు రాబట్టే ప్రయత్నంలో ఈ విభాగాల సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇక, పేలుళ్ల కేసు దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో పేలుళ్లకు సంబంధించి మలక్ పేట, సరూర్ నగర్ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను సీఐడీకి బదలాయించారు.

మరోవైపు ఎన్ఐఏ బృందం డీజీ ఎస్.పి.సిన్హా రాష్ట్ర డీజీపీ దినేశ్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఘటనపై ఇరువురూ చర్చించినట్లు సమాచారం.