: కిరణ్ విధేయత గల సైనికుడు: రేణుకా చౌదరి


తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయబోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారంటూ వస్తున్న వార్తలను కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరి ఖండించారు. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమని, ఆధారంలేనివన్నారు. ఎలాంటి పరిస్థతుల్లోనూ కిరణ్ అలా చేయరని, అధిష్ఠానం పట్ల ఆయన విధేయత గల సైనికుడని ప్రశంసించారు. కిరణ్ పై వచ్చిన వార్తలు వక్రీకరించినవని అనుకుంటున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ వార్తలను కిరణ్ కూడా కొట్టి పారేశారు. ప్రస్తుతం కిరణ్ ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News