: తెలంగాణ ఇస్తే తెరపైకి వచ్చే కొత్త డిమాండ్లు ఇవే..


ప్రత్యేక తెలంగాణకు కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపితే మరికొన్ని చిన్న రాష్ట్రాల డిమాండ్లు వారిని ఉక్కిరిబిక్కిరి చేయడం తథ్యమంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ క్రమంలో మరిన్ని ప్రాంతాలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించడం ఖాయమని వారు అంటున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో గతకొంతకాలంగా వినవస్తున్న డిమాండ్ల జాబితా ఓసారి పరికిద్దాం. బోడోలాండ్, దిమారాజి (అసోం), గూర్ఖాలాండ్ (పశ్చిమబెంగాల్), కొంగునాడు (తమిళనాడు), విదర్భ (మహారాష్ట్ర), సౌరాష్ట్ర (గుజరాత్), కుకీలాండ్ (మణిపూర్), లడఖ్ (జమ్మూకాశ్మీర్), కూర్గ్ (కర్ణాటక), బుందేల్ ఖండ్ (ఉత్తరప్రదేశ్), మిథిల (బీహార్), పూర్వాంచల్ (ఉత్తరప్రదేశ్), తుళునాడు (కర్ణాటక), వింధ్యప్రదేశ్ (మధ్యప్రదేశ్), హరిత్ ప్రదేశ్ (ఉత్తరప్రదేశ్).. ఇలా పెక్కు ఉద్యమాలు భారతావనిలో వినిపిస్తున్నాయి. ఒకవేళ కేంద్రం తెలంగాణకు ఓకే చెబితే, ఈ ఉద్యమాలకు నిస్సందేహంగా ఊపొస్తుంది.

  • Loading...

More Telugu News