: ఆడుకునే వయసులో గ్రహశకలం గుర్తించిన చిచ్చర పిడుగులు


వయసు 12 ఏళ్లు. చదివేది 7వ తరగతి. కానీ, వారు అందరిలా మైదానంలో ఆటల్లో మునిగిపోలేదు. కంప్యూటర్ల ముందు వీడియో గేములతో కాలక్షేపం చేయలేదు. పెద్ద పెద్ద శాస్త్రవేత్తల్లా పరిశోధన చేపట్టి ముందడుగు వేశారు. అంతర్జాతీయ గుర్తింపును సొంతం చేసుకున్నారు.

ఢిల్లీలోని అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్లో శౌర్య చాంబియాల్, గౌరవ్ 7వ తరగతి చదువుతున్నారు. పోయిన మే నెలలో జరిగిన ఖగోళశాస్త్ర సదస్సులో వీరు పాల్గొన్నారు. అంతే, వారికి ఖగోళశాస్త్రంపై మక్కువ పెరిగిపోయింది. గ్రహశకలాన్ని గుర్తించడం సాధ్యమేనని వారికి ఫిజిక్స్ టీచర్ చెప్పారు. అదే ప్రోత్సాహంతో వారిద్దరూ కంప్యూటర్ల ముందు కూర్చుని అవసరమైన సాఫ్ట్ వేర్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

దాని సాయంతో గంటలు, రోజుల తరబడి సాధన చేసి మొత్తానికి నింగిలో ఒక గ్రహశకలాన్ని గుర్తించారు. ఆ వివరాలను నాసాకూ పంపించగా.. ఆస్టరాయిడ్ హాల్ ఆఫ్ ఫేమ్ ఆమోదించింది. ప్రస్తుతానికి దీని పేరు ఎల్ఎస్28. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదివి, సైన్స్ ఫిక్షన్ రచయితగా ఎదగాలన్నది గౌరవ్ లక్ష్యం. నాసా శాస్త్రవేత్త కావాలన్నది శౌర్య ఆశయం. ఇంత చిన్న వయసులోనే వీరింత ప్రతిభ చూపుతున్నారంటే, భవిష్యత్తులో దేశం మెచ్చుకోదగ్గ వారవుతారనిపిస్తోంది.

  • Loading...

More Telugu News