: ఐదుగురు ఎంపీలతో మా పాత్ర ఏముంటుంది?: పయ్యావుల
తెలంగాణ అంశంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ స్పందించారు. కీలక తరుణంలో టీడీపీ నేతలు మౌనం వహిస్తున్నారన్న విమర్శలకు బదులిచ్చే ప్రయత్నం చేశారు కేశవ్. తెలంగాణ ప్రాంతంలో తమకు ఐదుగురు ఎంపీల బలం మాత్రమే ఉందని, అందుకే, ఈ విషయంలో తమ పాత్ర నామమాత్రమే అని స్పష్టం చేశారు. హైదరాబాదులో నేడు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని ఆరోపించారు. రోశయ్య, ప్రణబ్, శ్రీకృష్ణ కమిటీ నివేదికలు పట్టించుకోకుండా బుట్టదాఖలు చేసిందని మండిపడ్డారు.