: విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు చేయండి: సుప్రీంలో సీబీఐ పిటిషన్


కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆడిటర్ విజయసాయి రెడ్డికి ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ శుక్రవారం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేసిన న్యాయస్థానం తదుపరి విచారణను మార్చి14వ తేదీకి వాయిదావేసింది.

ఈ సమయంలో ఇరువైపుల న్యాయవాదులు తమ వాదనలు వినిపించగా, సాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాల్సిన అవసరం లేదని అతని తరపు న్యాయవాదులు వాదించారు. అన్ని అంశాలు పరిశీలించాకే హైకోర్టు సాయిరెడ్డికి బెయిల్ మంజూరు చేసిందని వారు తెలిపారు. 

  • Loading...

More Telugu News