: తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండంటే సరికాదు: జేపీ
తెలంగాణ వ్యవహారం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. సమాఖ్య వ్యవస్థలో ఏ నిర్ణయమైనా రాజ్యాంగబద్ధంగా ఉండాలని ఆకాంక్షించారు. మీడియాతో మాట్లాడుతూ, కేంద్రం తీరు చూస్తుంటే.. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండన్నట్లుందని వ్యాఖ్యానించారు. ఓట్ల కోసం రాజకీయ పార్టీలు ఈ ఉద్యమాన్ని ఎగదోశాయని ఆయన ఆరోపించారు. ఇక, ఈ సాయంత్రం వెలిబుచ్చే నిర్ణయం తెలుగు ప్రజలందరికి ఆమోదయోగ్యమైనది, అందరి మనసులకు ఊరట కలిగించేదిగా ఉండాలని సూచించారు.