: తరగతులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతు
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు తరగతులు బహిష్కరించి సమైక్యాంధ్రకు మద్దతు తెలిపారు. అనంతరం సమైక్యాంధ్రకు మద్దతుగా జాతీయ రహదారిపై ర్యాలీ నిర్వహించి, యూనివర్సిటీ గేటు ముందు ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ ఆచార్యులు తులసీరావ్, కామరాజు, చంద్రయ్య, బోధనా సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.