: పాక్ జైలుపై తాలిబాన్ల దాడి.. 300 ఖైదీలకు విముక్తి


తాలిబన్లు పాకిస్తాన్ లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ పట్టణంలోన ఉన్న జైలుపై దాడికి తెగించారు. 50 నుంచి 60 మంది తాలిబన్లు ఆయుధాలతో వచ్చి భద్రతా సిబ్బందిపై కాల్పులు జరుపుతూ.. జైలులో ఉన్న 300 మంది ఖైదీలను తప్పించారు. భద్రతా దళాలు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇది సోమవారం రాత్రి జరిగింది. ఈ దాడిలో పలువురు ఖైదీలు, నలుగురు జైలు భద్రతా సిబ్బంది, ఇద్దరు తాలిబన్లు మరణించారు. ఈ జైలులో మొత్తం 5,000 మంది ఖైదీలు ఉండగా, వారిలో 250 మంది అత్యంత కరుడు కట్టిన ఉగ్రవాదులు. తాము 300 మంది ఖైదీలకు విముక్తి కల్పించినట్లు ఉగ్రవాద సంస్థ తెహ్రీకే తాలిబాన్ ప్రకటించింది.

  • Loading...

More Telugu News