: హైదరాబాద్ టెస్టుపై వీడిన సందిగ్దం


హైదరాబాదులో భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు నిర్వహణపై ముసురుకున్న అనుమాన మేఘాలు తొలగిపోయాయి. షెడ్యూల్ ప్రకారమే మార్చి 2 నుంచి రెండో మ్యాచ్ మొదలవుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది.

కాగా, హైదరాబాద్ వరుస పేలుళ్ల ఘటనతో ఆందోళనకు గురైన క్రికెట్ ఆస్ట్రేలియా ఈ రోజు బీసీసీఐ అధికారులతో ఆటగాళ్ల భద్రత గురించి చర్చించింది. భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్ల భద్రతకు భరోసా ఇవ్వడంతో మ్యాచ్ నిర్వహణపై సందిగ్దం వీడింది. రెండో టెస్టు యధావిధిగానే జరుగుతుందని క్రికెట్ ఆస్ట్రేలియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జేమ్స్ సదర్లాండ్ చెప్పారు.

  • Loading...

More Telugu News