: ఎంపీ హర్షకుమార్ చెబుతున్న 'సొల్యూషన్'
ఢిల్లీలో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ను కలిసిన అనంతరం సీమాంధ్ర ఎంపీలు మీడియాతో మాట్లాడారు. అమలాపురం ఎంపీ హర్షకుమార్ మాట్లాడుతూ, హైదరాబాదును శాశ్వత కేంద్ర పాలిత ప్రాంతంగా చేయాలని తాము దిగ్విజయ్ కు సూచించామని తెలిపారు. ఇప్పటికే హైదరాబాదు ఎంతో అభివృద్ధి చెందిందని, సీమాంధ్రలో అంతలా పురోగతి సాధించిన నగరం లేదని, అందుకే హైదరాబాదును ప్రత్యేకంగా ఉంచాలని తాము డిమాండ్ చేశామని హర్షకుమార్ స్పష్టం చేశారు.