: ప్రధానితో సోనియా భేటీ
కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఈ మధ్యాహ్నం ప్రధాని మన్మోహన్ సింగ్ తో భేటీ అయ్యారు. ఈ రోజు సాయంత్రం నిర్వహించాల్సిన సీడబ్ల్యూసీ, యూపీఏ సమావేశాల అంశంపై చర్చించేందుకు ఆమె ప్రధానిని కలిశారు. ఆ భేటీ అనంతరం వెల్లడించాల్సిన నిర్ణయం తీరుతెన్నులు, తదనంతర పరిణామాలపై కూలంకషంగా ప్రధానితో సమాలోచనలు జరపనున్నట్టు సమాచారం.