: రెండు రైళ్లు ఢీ
స్పెయిన్ రైలు ప్రమాద దుర్ఘటన మర్చిపోకముందే స్విట్జర్లాండ్ లో మరో ప్రమాదం జరిగింది. పశ్చిమ స్విట్జర్లాండ్ లోని వాడ్ కాన్టన్ రాష్ట్రంలో సోమవారం రాత్రి రెండు ప్యాసింజర్ రైళ్లు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 44 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్టు వాడ్ కాంటన్ పోలీస్ అధికారి జీన్ క్రిస్టోవ్ తెలిపారు.