: నడి రోడ్డుపై స్కూలు బస్సు బోల్తా
విశాఖపట్నంలో రద్దీగా ఉండే గురుద్వార్ జాతీయ రహదారిపై శ్రీప్రకాశ్ విద్యాసంస్థకు చెందిన స్కూలు బస్సు బోల్తా పడింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. గాయపడిన విద్యార్థులను, డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. కాగా లక్షలాది రూపాయలు ఫీజులుగా వసూలు చేసే కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు.