: ఉసూరుమనిపించిన ఆర్ బీఐ


'వడ్డీ రేట్లు అధికంగా ఉన్నాయ్.. తగ్గించండి బాబోయ్' అన్న పారిశ్రామిక వేత్తల అభ్యర్థనలు.. వృద్ధికి ఊతం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్న ప్రభుత్వ సూచనలు.. వీటిని ఏమాత్రం పట్టించుకోకుండా ఆర్ బీఐ ఎప్పటిలానే ద్రవ్యపరపతి విధానాన్ని ప్రకటించింది. గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన తొలి త్రైమాసిక పరపతి సమీక్షా సమావేశంలో.. కీలక రేట్లు అయిన రెపో, సీఆర్ఆర్ ఇతరత్రా వేటీని ఆర్ బీఐ ముట్టుకోలేదు. దీంతో ఎప్పటిలానే ద్రవ్యోల్బణం కట్టడికి.. రూపాయి విలువ కాపాడేందుకే ఆర్ బీఐ ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తోంది.

వాస్తవానికి దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి మే నెలలో అథోముఖంలోకి వెళ్లిపోయింది. మరోవైపు, భారతదేశ వృద్ధి దశాబ్ద కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. డాలర్ తో రూపాయి విలువ కూడా అత్యంత కనిష్ఠ స్థాయిలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వడ్డీ రేట్లను తగ్గించడం వల్ల పారిశ్రామిక వేత్తలకు రుణాల భారం తగ్గుతుందని, దాంతో విస్తరణపై వ్యయం పెరిగి వృద్ధికి తోడ్పడుతుందని భావించారు. కానీ ఆర్ బీఐ వీటిని విస్మరించింది.

మరోవైపు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముందుగా వేసిన జీడీపీ వృద్ధి అంచనాను ఆర్ బీఐ 5.5శాతానికి తగ్గించింది. కరెంటు ఖాతా లోటుకు తమవంతు చర్యలు తీసుకున్నామని దువ్వూరి సుబ్బారావు చెప్పారు.

  • Loading...

More Telugu News