: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన నటుడు మనోజ్ కుమార్


బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అనారోగ్యం కారణంగా 76 సంవత్సరాల మనోజ్ కుమార్ ఈ నెల 17న ముంబయిలోని కోకిలాబెన్ ధీరూభాయి అంబానీ ఆసుపత్రిలో చేరారు. గాల్ బ్లాడర్ కేన్సర్ అని తెలియడంతో ఈనెల 24న ఆపరేషన్ చేశారు. శస్త్ర చికిత్స విజయవంతం కావడంతో నాలుగు రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. నిన్న సాయంత్రం ఆయనను ఇంటికి పంపించినట్లు ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామ్ నారాయణ్ తెలిపారు.

  • Loading...

More Telugu News